గ్యారంటీకి వెనుకడుగు
● సీఎంఆర్‌కు దూరంగా మిల్లర్లు
● జిల్లాలో 13 మందే సుముఖత
● మిగతా ధాన్యం గోదాములకే..
● సన్న వడ్ల సాగుతో కాస్త ఊరట
తిప్పలు తప్పినట్లేనా?
ధాన్యం కొనుగోళ్లలో యాసంగితో పోలిస్తే వానాకాలంలో ఇబ్బందులు తక్కువ. చాలా మంది రైతుల సొంత వినియోగం పోను అ మ్మకానికి కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక ఈ సారి సన్నాలకు డిమాండ్ పెరగడంతో ప్రైవేట్‌లోనూ అధిక ధరలు చెల్లిస్తున్నారు. దీంతో సర్కారుకు భారం తగ్గింది. ప్రస్తుతం అండర్ టేకింగ్ ఇచ్చి ముందుకు వచ్చిన మిల్లులకు సరిపోను, మరో మూడు, నాలుగు మిల్లులు కూడా బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయని అధికారులు ఆశిస్తున్నారు. ఇక మిగతా ధాన్యం జిల్లాలోని గోదా ముల్లో నిల్వ ఉంచేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయినప్పటికీ ఇ బ్బంది ఉంటే పొరుగు జిల్లాకు ధాన్యం సరఫరా చేయనున్నారు. అయితే బ్యాంక్ గ్యారంటీల నిబంధనతో జిల్లాలోని రైస్‌మిల్లర్లకు నష్టం వాటిల్లుతోందని మిల్లర్ల సంఘం నాయకులు వాపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బ్యాంక్ గ్యారంటీల మెలిక జిల్లాలో మిల్లర్లకు ఇబ్బందికరంగానే మారింది. వానాకాలంలో వరికోతలు ప్రారంభమై ధాన్యం కేంద్రాలకు వస్తున్నప్పటికీ ఇప్పటికీ 13మంది మిల్ల ర్లు మాత్రమే బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చేందుకు ముందుకువచ్చారు. అయితే బ్యాంక్ గ్యారంటీలు ఇస్తామని అండర్ టేకింగ్ రాసి ఇవ్వడంతోనే ఆ మి ల్లులకు అధికారులు ధాన్యం అప్పగిస్తున్నారు. దీంతో కొంత మేర భారం తగ్గింది. ఈ సీజన్ నుంచి ప్ర భుత్వం మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీలు ఇస్తేనే ధా న్యం సీఎంఆర్ (కస్టం మిలింగ్ రైస్) ఇస్తామని షర తు పెట్టడం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాలో చాలా మిల్లులు సీఎంఆర్‌కు దూరంగా ఉన్నాయి. ప్రతీ సీ జన్‌లో జిల్లాలో దాదాపు 55మిల్లులకు పైగా పౌరసరఫరాల శాఖకు సీఎంఆర్ ఇచ్చేందుకు అందుబా టులో ఉండేవి. అయితే బ్యాంక్ గ్యారంటీలకు ఆస క్తి చూపిన వారికే ధాన్యం ఇస్తున్నారు. ఈసారి 3.26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుందనే అంచనాతో కొనుగోళ్లు సాగుతున్నా యి. మరోవైపు ఈ సీజన్ నుంచే సన్నాలకు క్వింటా ల్‌కు రూ.500 బోనస్ వర్తింపజేయడంతో ఈ రకం వడ్లకు డిమాండ్ పెరిగింది. ఇక జిల్లాలో గతం కంటే అధికంగా సన్న రకం సాగు చేశారు. దీంతో ప్రైవేట్‌లోనూ ధర పెరిగింది. అయితే ప్రభుత్వం నిర్దేశించిన 33 రకాల సన్నాలనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ప్రత్యేక యంత్రంతో పరీక్షించాకే కొంటు న్నారు. అయితే కొన్ని సన్నాలను గుర్తించడంలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 326 కేంద్రాల ఏర్పాటుకు చేయాల్సి ఉండగా, ప్రస్తుతం 317 సెంటర్లల్లో కొనుగోళ్లు సాగుతున్నాయి.
ధాన్యం గోల్‌మాల్ చేస్తున్నారని..
జిల్లాలో ఏటా ధాన్యం దిగుబడి పెరుగుతూ వస్తోంది. గతేడాది వానాకాలం 1.39లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. అయితే ఆయా సీజన్లలో మిల్లులకు పంపిన ధాన్యం సకాలంలో పౌరసరఫరాల శాఖకు బియ్యంగా అందలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.వందల కోట్లు వెచ్చిస్తున్నప్పటికీ బియ్యం పొందడంలో జాప్యం జరిగింది. కొన్ని చోట్ల ధాన్యమే లేకపోవడం, అమ్ముకోవడం, పలు కారణాలతో ప్రతీ సీజన్‌లోనూ జాప్యం జరుగుతూ వస్తోంది. దీంతో ఆయా మిల్లులకు నోటీసులు, జరిమానాలు విధించారు. చివరకు క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. ఈసారి కచ్చితంగా బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వాలనే నిబంధన చాలామంది మిల్లర్లను ఇబ్బంది పెడుతోంది. ప్రభుత్వం అందించే ధాన్యం విలువకు కనీసం 10శాతం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి. ఇక గతంలో సీఎంఆర్ బకాయిలున్న మిల్లులకు 25శాతం చొప్పున ఇవ్వాలంటూ షరతు విధించారు. దీంతో జిల్లాలో చాలా మిల్లులు బకాయిలు ఉండటంతో అంతమేర గ్యారెంటీలు ఇవ్వలేక ముందుకు రావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment