అన్ని రంగాల్లో రాణించాలి
మంచిర్యాలఅర్బన్: దివ్యాంగ విద్యార్థులు అ న్ని రంగాల్లో రాణించాలని డీఈవో యాదయ్య సూచించారు. మంగళవారం మంచిర్యాల భవి త కేంద్రంలో అంతర్జాతీయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష్యసాధనకు చదువు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఉచిత వి ద్య, పెన్షన్, ఉపకరణాలను సద్వినియోగం చే సుకోవాలని సూచించారు. భవిత కేంద్రంలో వారానికోరోజు ఉచిత ఫిజియోథెరపీ క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆటలపోటీల్లో విజేతలుగా నిలిచిన దివ్యాంగ విద్యార్థులకు బ హుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సమ్మిళిత విద్య కో–ఆర్డినేటర్ చౌదరి, సత్యనారాయణమూర్తి, ఎంఈవో మా లవీదేవి, కాంప్లెక్స్ హెచ్‌ఎం పద్మజా, ఐఈఆ ర్పీలు సృజన, శ్రీలత తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment