ఎస్టీపీపీ కార్మిక సమస్యలపై చర్చలు
జైపూర్: మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై హైదరా బాద్‌లో డిప్యూటీ సీఎల్‌సీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎస్టీపీపీ బీఎంఎస్ యూనియన్ నాయకులు ప వర్‌మేక్ కంపెనీ అధికారులతో చర్చించారు. యూ నియన్ నాయకులు ప్రతిపాదించిన సమస్యలపై రెండ్రోజుల్లో ఎస్టీపీపీ ఈడీతో చర్చించి పరిష్కారాని కి చర్యలు తీసుకుంటామని యాజమాన్యం అంగీకరించిందని, దీనికి యూనియన్ నాయకులు కూడా అంగీకరించినట్లు తెలిపారు. ఈ నెల 17వరకు అ న్ని డిమాండ్లు అంగీకరించని పక్షంలో ఎఫ్‌వోసీకి వె ళ్తామని పేర్కొన్నారు. బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి దుస్స భాస్కర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బోడకంట శ్రీధర్, ఉపాధ్యక్షుడు పెద్దపల్లి ప్రభాకర్‌చారి, సెక్రటరీ కిషన్‌రెడ్డి, పాత శివకృష్ణ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment