శ్రీరాంపూర్‌లో కొత్త క్వార్టర్లు | - | Sakshi
Sakshi News home page

శ్రీరాంపూర్‌లో కొత్త క్వార్టర్లు

Published Wed, Dec 4 2024 12:28 AM | Last Updated on Wed, Dec 4 2024 12:28 AM

శ్రీరాంపూర్‌లో కొత్త క్వార్టర్లు

శ్రీరాంపూర్‌లో కొత్త క్వార్టర్లు

మోడళ్లు, క్వార్టర్ల సంఖ్య

మిలీనియం–ఏ 15

మిలీనియం–బీ 36

మిలీనియం–సీ 98

మిలీనియం–డీ 1,078

మొత్తం 1,227

ప్రతిపాదనలు పంపాం

శ్రీరాంపూర్‌ ఏరియాలో కొత్త క్వార్టర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. కార్పొరేట్‌ కమిటీ కూడా స్థలాలను పరిశీలించింది. కార్పొరేట్‌ అధికారులు ఆమోద వేస్తే క్వార్టర్ల నిర్మాణం జరుగనుంది.

– ఎల్వీ సూర్యనారాయణ,

జీఎం, శ్రీరాంపూర్‌

శ్రీరాంపూర్‌: కంపెనీలోనే అతిపెద్ద ఏరియా, ఎక్కు వ ఉద్యోగులున్న శ్రీరాంపూర్‌లో కొత్తగా 1,227 క్వా ర్టర్ల నిర్మాణానికి సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. ఏరియా అధికారులు కొద్దిరోజుల క్రితం కార్పొరేట్‌ అధికారులకు ప్రతిపాదనలు పంపారు. దీనిపై కార్పొరేట్‌ నుంచి ప్రత్యేక కమిటీ వారం క్రితం వచ్చి శ్రీరాంపూర్‌లో పర్యటించింది. కమిటీ సభ్యులు క్షేత్ర స్థాయిలో స్థల పరిశీలన చేశారు. ఎస్సార్పీ 3, 3 గనికి ఆనుకుని ఉన్న 40 ఎకరాల కంపెనీ స్థలంతోపాటు నస్పూర్‌ కాలనీలోని మార్టిన్‌ గ్రామర్‌ స్కూల్‌, కంపెనీ డీ టైప్‌ క్వార్టర్ల మధ్యనున్న సుమారు నాలుగెకరాలనూ పరిశీలించారు. భూగర్భ గనులకు దగ్గరగా కంపెనీ స్థలాలున్నప్పటికీ అవి ఎప్పటికై నా ఓసీపీలుగా మారితే క్వార్టర్లకు ఇబ్బంది ఉంటుంది. దీంతో నస్పూర్‌ వైపు ఉన్న స్థలాల్లోనే క్వార్టర్ల నిర్మాణం చేపట్టాలని ఏరియా అధికారులు, కమిటీ సభ్యులు భావిస్తున్నారు.

శిథిలావస్థలో క్వార్టర్లు

ప్రస్తుతం శ్రీరాంపూర్‌లో 8,746 మంది ఉద్యోగులుండగా, వీరికి 7,147 క్వార్టర్లున్నాయి. వీటిలో ఆర్కే 5 కాలనీ, శ్రీరాంపూర్‌ కాలనీలోని ఉన్న రేకు ల క్వార్టర్లు చాలా వరకు శిథిలావస్థకు చేరాయి. డీ టైప్‌ క్వార్టర్లూ కొన్ని కాలనీల్లో శిథిలావస్థకు చేరా యి. ఇవి 40 ఏళ్ల క్రితం నిర్మించగా, షిర్కే క్వార్టర్లు 33 ఏళ్ల క్రితం నిర్మించారు. ఆ తర్వాత చాలా ఏళ్లుగా కొత్తక్వార్టర్లు నిర్మించకపోవడంతో ఉన్నవాటిలోనే కార్మికులు నివసించాల్సి వస్తోంది. కొత్త క్వా ర్టర్లు నిర్మిస్తే శిథిలావస్థలోనివి కూల్చివేశే అవకాశముంది. కాగా, చెన్నూర్‌లో మరో 292 క్వార్టర్లుండగా, అక్కడి గనులు మూతపడగా చాలా ఏళ్లుగా అవి ఖాళీగా ఉంటున్నాయి.

మిలీనియం మోడళ్లలో నిర్మాణాలు

భూపాలపల్లి లాంటి ఏరియాల్లో కంపెనీ ఇటీవల నూతనంగా చేపట్టిన నాలుగు రకాల మిలీనియం మోడల్‌ క్వార్టర్లనే ఇక్కడా నిర్మించనున్నారు. అధికా రులు, ఉద్యోగుల హోదాలకు తగినట్లు వేర్వేరు ని ర్మాణాలు చేపట్టనున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌ కం ఫస్ట్‌ ఫ్లో ర్‌, డబుల్‌ బెడ్రూం తరహాలో ఒక బ్లాక్‌కు 14 క్వా ర్టర్లు ఉండేలా నిర్మాణ స్వరూపం ఉండనుంది. తా గునీరు, రోడ్లు, విద్యుత్‌, డ్రైనేజీ, ఎస్టీపీ, మైదానం వసతితో అంతా మోడ్రన్‌గా ఉండేలా నిర్మించనున్నారు. ఈ మేరకు ఏరియా అధికారులు ప్రతిపాదనలు పంపారు. త్వరలోనే కార్పొరేట్‌ ఉన్నతాధికారులు ఆమోదముద్ర వేయనున్నట్లు తెలిసింది.

ప్రతిపాదనలు పంపిన అధికారులు

స్థలాలు పరిశీలించిన కార్పొరేట్‌ కమిటీ

జీ ప్లస్‌ వన్‌, డబుల్‌ బెడ్రూం ఇళ్ల

మోడళ్లలో చేపట్టనున్న నిర్మాణాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement