ఏడు నెలలుగా ఎదురుచూపులు
● జీతాలు రాక ఇబ్బందుల్లో ఆర్పీలు ● వెంటనే వేతనాలు ఇవ్వాలని విజ్ఞప్తి
చెన్నూర్: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ, బ్యాంకర్లతో మాట్లాడి చిరువ్యాపారులకు సూక్ష్మ రుణాలిప్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్న మెప్మా రిసోర్స్ పర్సన్లకు ఏడు నెలలుగా వేతనాలు రావడంలేదు. దీంతో వారు కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో సుమారు 232 మంది పని చేస్తున్నారు. వీరికి ప్రభుత్వం నెలకు రూ.6వేల గౌరవవేతనం ఇస్తోంది. వచ్చే అరకొర వేతనం సకాలంలో అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రెండు నెలల క్రితం చెన్నూర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి, కలెక్టర్ కుమార్‌దీపక్‌కు రిసోర్స్ పర్సన్లు వినతిపత్రం ఇచ్చినా నేటికీ వారి సమస్యలు పరిష్కారం కాలేదు.
ఇవీ.. ఆర్పీల విధులు
ఆర్పీలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీ సుకువెళ్తున్నారు. మొక్కలు నాటే కార్యక్రమం, స్వ చ్ఛభారత్‌లో పాల్గొంటున్నారు. తడి, పొడి చెత్త వే రు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా రు. బ్యాంక్ లీంకేజీ రుణాలిప్పిస్తున్నారు. మున్సిపాలిటీల పరిధిలో ఏ సర్వే చేసినా భాగస్వాములవుతున్నారు. ఇలా.. మున్సిపాలిటీల్లో చేపట్టే కార్యక్రమాల్లో అన్నీ తామై వ్యవహరిస్తున్న వీరికి సకాలంలో వేతనాలు అందడంలేదు. ఉద్యోగ భద్రత కల్పించడంలేదు. దీంతో వీరు ఆవేదన చెందుతున్నారు.
మున్సిపాలిటీల వారీగా ఆర్పీల వివరాలు
మంచిర్యాల 58
బెల్లంపల్లి 35
మందమర్రి 39
క్యాతన్‌పల్లి 19
లక్సెట్టిపేట 17
చెన్నూర్ 19
నస్పూర్ 45
మొత్తం 232
Comments
Please login to add a commentAdd a comment