పౌష్టికాహార లోపం లేకుండా చూడాలి
మంచిర్యాలటౌన్: జిల్లాలో పౌష్టికాహార లోపంతో బాధపడే ఐదేళ్లలోపు పిల్లల వివరాలను స్యామ్‌మామ్ ద్వారా నమోదు చేసి వారిలో పౌష్టికాహార లోపం లేకుండా చూడాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా క్టర్ హరీశ్‌రాజ్ అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో శుక్రవారం జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లు, స్టాఫ్‌నర్సులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పిల్లల వివరాల నమోదు కోసం ప్రతి ఒక్క రూ పాల్గొనాలని, లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. అంగన్‌వాడీ అధికారులు, టీచర్లతో సమన్వయం చేసుకుంటూ పౌ ష్టికాహార లోపం ఉన్న వారి వివరాలు తీసుకుని సంక్షేమశాఖతో సమన్వయం చేసుకో వాలని తెలిపారు. మాతాశిశు ఆరోగ్య సంరక్షణలో భాగంగా గర్భిణుల వివరాలు నమోదు చేయాలని, ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని, 102 వాహనం ద్వారా గర్భిణులను ఇంటి నుంచి ఆసుపత్రులకు తీసుకు రావాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment