శాంతిభద్రతల పరిరక్షణలో అలసత్వం వద్దు
● రామగుండం సీపీ శ్రీనివాస్
మంచిర్యాలక్రైం: శాంతిభద్రతల పరిరక్షణలో అలసత్వం వహించొద్ద ని రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా పరిధిలోని డీసీపీ, ఏసీపీ, ఎస్‌హెచ్‌ఓలతో వార్షిక నేర స మీక్ష సమావేశం జూమ్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ మహిళల కేసులు, పోక్సో కేసుల్లో త్వరితగతిన విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జీషీట్ దా ఖలు చేయాలని అన్నారు. నేరాల తీరు, ఎక్కువగా నేరాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అసాంఘిక శక్తులు, మావోయిస్టులపై దృష్టి కేంద్రీకరించి కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్, నిరంతర పెట్రోలింగ్, ఆకస్మిక వాహన తనిఖీ లు చేపట్టాలని అన్నారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీపీ చేతన, అడిషనల్ డీసీపీ(అడ్మిన్) సి.రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, కమిషనరేట్ పరిధిలో ని ఏసీపీలు, ఏఆర్ ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment