క్రీడల్లో రాష్ట్రస్థాయిలో రాణించాలి
● కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలటౌన్: జిల్లాలో నిర్వహిస్తున్న సీఎం కప్ జిల్లాస్థాయి పోటీల్లో గెలుపొంది, రాష్ట్రస్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తేవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఉషోదయ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి రన్నింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. జిల్లా యువజన క్రీడాభివృద్ధి అధికారి కీర్తి రాజ్‌వీరు, జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్‌ఖాన్ పాల్గొన్నారు.
నేడు విజేతలకు బహుమతులు
జిల్లాస్థాయి సీఎం కప్ పోటీల విజేతలకు ఈ నెల 21న సాయంత్రం 3 గంటలకు జెడ్పీ బాలుర ఉన్న త పాఠశాల మైదానంలో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికా రి రాజ్‌వీర్ ఒక ప్రకటనలో తెలిపారు. అథ్లెటిక్, ఖోఖో, కబడ్డీ, నెట్‌బాల్, యోగ, బాక్సింగ్, బాస్కె ట్ బాల్, కిక్ బాక్సింగ్, రెజ్లింగ్, చెస్, కరాటే, జూ డో, హ్యాండ్‌బాల్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, వివిధ క్రీడాంశాల విజేతలు హాజరుకావాలని తెలిపారు.
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను ఈ నెల 31లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్‌లో ముఖ్య ప్రణాళిక అధికారి సత్యంతో కలిసి పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖల అధికారులతో జిల్లాలో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మురుగు కాల్వలు, అంతర్గత రహదారులు, సెప్టిక్ ట్యాంక్‌లు, కల్వర్టులు, ప్రహరీలు, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలు పూర్తి చేసేలా ప్రతీరోజు పురోగతిని పర్యవేక్షించాలని తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఈఈ ఎం.స్వామిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment