సమగ్ర శిక్షా ఉద్యోగుల ర్యాలీ
మంచిర్యాలఅగ్రికల్చర్: సమగ్ర శిక్షా ఉద్యోగులు చేపట్టిన సమ్మెలో భాగంగా 11వ రోజు శుక్రవారం కలెక్టరేట్ నుంచి జాతీయ రహదారి వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎస్‌ఏ జేఏసీ అధ్యక్ష, ప్రధాన, కార్యదర్శులు సుమలత, టి.రాజన్న మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని గత పదకొండు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. చాలీచాలని వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోయినా ఏళ్ల తరబడిగా విధులు నిర్వర్తిస్తున్నామని, ఎన్నికలకు ముందు అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, వెంటనే న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమ్మెకు సీపీఐ, ఎంఆర్పీఎస్ నాయకులు బర్రి సతీష్, సమ్మయ్య, తదితరులు సంఘీభావం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment