శ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ఓబీ సంస్థ జే వీఆర్ కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లను పరిష్కరించకుంటే సమ్మె కొనసాగిస్తామని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు అధికారులకు స్పష్టం చేశా రు. గురువారం జేఏసీ నాయకులు ఓపెన్ కాస్ట్ ప్రా జెక్ట్ మేనేజర్ బ్రహ్మాజీని కలిసి వినతిపత్రం సమర్పించారు. కాంట్రాక్ట్ కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశా రు. భూ నిర్వాసితులు, స్థానికులకు ఓబీ పనుల్లో 80శాతం ఉద్యోగాలు కల్పించాలని పేర్కొన్నారు. జేఏసీ నాయకులు అఫ్రోజ్‌ఖాన్, దొడ్డిపట్ల రవీందర్, కొండపర్తి శంకర్, రాజేష్, అగ్గు మల్లేష్, అన్నం ప్రశాంత్, మాసు ప్రసాద్, లక్కం రవి, ముప్పు వంశీ, సిరిపురం పవన్, సదానందం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment