‘ప్రత్యామ్నాయ సంస్కృతి అవసరం’
పాతమంచిర్యాల: ముంచుకు వస్తున్న ఫాసిజం ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ సంస్కృతి తక్షణ అవసరమని కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే అన్నారు. జిల్లా కేంద్రంలోని సారక్క, కొమురక్క హాల్‌లో శుక్రవారం పీవోడబ్ల్యూ ఐక్యత సభ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ వేర్వేరు సంఘాలుగా పని చేసిన వీవోడబ్ల్యూలు కలవడం ఆనందంగా ఉందన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను అడవుల నుంచి తరిమి అటవీ భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పనంగా అప్పగిస్తున్నారని విమర్శించారు. వాట్సాప్ యూనివర్సిటీ సమాచారం ద్వారా దేశ ప్రజల జీవన విధానాన్ని శాసిస్తోందని, దీనికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ జీవన విధానాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పీవోడబ్ల్యూ జాతీయ నాయకురాలు ఝాన్సీ, సంధ్య మాట్లాడారు. ఈ సందర్భంగా అమర వీరుల సంతాప తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ కార్యక్రమంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ, రాష్ట్ర కార్యదర్శి అందె మంగ, సీత, జ్యోతి, హరిత, సరిత, కార్యదర్శులు గీత, జానకి, కే.గీత, సభ్యులు ఆకుల అరుణ, ఉపేంద్ర, వివిధ జిల్లాల మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment