ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి
● ఎమ్మెల్యే గడ్డం వినోద్
బెల్లంపల్లిరూరల్: ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్య అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నా రు. శుక్రవారం మండలంలోని చర్లపల్లి గ్రా మంలో రూ.8.10 లక్షలతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అదనపు తరగతి గది భవనాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థుల కు మెరుగైన, నాణ్యమైన విద్య అందించడానికి, విద్యావ్యవస్థ పటిష్టానికి ఎనలేని కృషి చే స్తోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పా ఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిపుచ్చుకుని ఉన్నతంగా రాణించాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. అనంతరం గ్రామస్తులు ఎమ్మె ల్యే, కలెక్టర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. డీఈవో యాదయ్య, ఎంఈవో మహేశ్వర్‌రెడ్డి, ఏఈ వినయ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రాంచందర్, నాయకులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment