నాయీబ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలి
పాతమంచిర్యాల: నాయీబ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మంచిర్యాలలో కర్పూరీ ఠాకూర్ 101వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ నిరుపేద నాయీబ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ప్రజల అభ్యున్నతికి అనేక పోరాటాలు చేశారని అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో జరుగుతున్న అగ్రవర్ణ ఆధిపత్యం నుంచి బయటకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయీబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు కంది శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, బీసీ సమాజ్ మహిళా నాయకురాలు నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో..
మంచిర్యాలలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కర్పూరీ ఠాకూర్ 101వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కనుకుట్ల మల్లయ్య, సామాజిక న్యాయవేదిక జిల్లా కన్వీనర్ రంగు రాజేశం, బీసీ రాజ్యాధికార సమితి జిల్లా కో ఆర్డినేటర్ చలమల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment