బాలికలను కాపాడుకుందాం..
● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి
మంచిర్యాలఅగ్రికల్చర్: రేపటి భవిష్యత్ కోసం బాలికలను కాపాడుకుందామని జిల్లా న్యాయ సే వాధికార సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి అన్నా రు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో జిల్లా మహిళ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బేటీ బచావో–బేటీ పడావో దశాబ్ది ఉత్సవాల్లో జిల్లా సంక్షేమాధికారి రౌఫ్‌ఖాన్, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి నీరటి రా జేశ్వరి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధి కారి పురుషోత్తంనాయక్‌లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలిక రక్షణ కు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమం పదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలి పారు. ఆడపిల్లను బతికించుకుందామని, వారిని చదివించుకుని వారి హక్కులను కాపాడుకుందామ ని, బాలికలను స్వేచ్ఛగా ఎదగనిద్దామని అన్నారు. విద్యార్థినులు చదువుపై దృష్టి సారించాలని, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎంచుకున్న లక్ష్యం వైపుగా నడవాలని తెలిపారు. బాలికల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలను తెలుసుకోవాలని అన్నారు. అనంతరం సంతకాలు సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బేటీ బచావో– బేటీ పడావో వాల్‌పోస్ట ర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జీసీడీవో బాలల పరిక్షణ సమితి అధికారి అనంద్ సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు, విద్యార్థినులు పాల్గొన్నారు.
సింగరేణి ఉత్తమ ఉద్యోగులు వీరే..
శ్రీరాంపూర్/మందమర్రిరూరల్: గణతంత్ర దినో త్సవ వేడుకలను పురస్కరించుకుని సింగరేణి య జమాన్యం ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేసింది. సింగరేణి వ్యాప్తంగా ఏరియాల వారీగా బెస్ట్ సింగరేణియన్‌ను ఎంపిక చేశారు. ఇందులో భాగంగా శ్రీ రాంపూర్ ఏరియా నుంచి ఆర్కే 5 గనికి చెందిన ఎస్‌డీఎల్ ఆపరేటర్ అటికం శ్రీనివాస్ ఎంపికయ్యా రు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 5, 6, 7 గనులు, ఎస్‌ఆర్పీ 1, 3, ఐకే 1ఏ గనులు, ఇందారం, శ్రీ రాంపూర్ ఓపెన్ కాస్ట్ గనుల్లో విధి నిర్వహణలో ప్ర తిభ కనబరిచిన 18మందిని ఎంపిక చేయగా.. ఆది వారం జరిగే వేడుకల్లో సన్మానించనున్నారు. మందమర్రి ఏరియాలో ఉత్తమ సింగరేణియన్‌గా సయ్యద్ అబ్బాస్(ఫోర్‌మెన్, ఆర్కేసీపీ) ఎంపికయ్యారు. ఏ రియాలోని 12మంది ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక చేశారు. ఉత్తమ సింగరేణియన్‌లుగా ఎంపికై న అ టికం శ్రీనివాస్, సయ్యద్‌అబ్బాస్ కొత్తగూడెంలోని సింగరేణి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కంపెనీ సీఎండీ చేతుల మీదుగా సన్మానం పొందనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment