రిటైర్డ్ కార్మికులకు రివైజ్డ్ పింఛన్ చెల్లించాలి
మంచిర్యాలటౌన్: సింగరేణి సంస్థలో 11వ వేజ్ బోర్డు కాలపరిమితిలో రిటైర్మెంట్ పొందిన కార్మికులకు రివైజ్డ్ పింఛన్ చెల్లించాలని జిల్లా సింగరేణి రిటైర్మెంట్ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై 2021 నుంచి అమలైన 11వ వేజ్ బోర్డు ఒప్పందానికి వేతనాలపై పెరిగిన పింఛన్‌ను వేలాది మంది రిటైర్డ్ కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సింగరేణిలోని అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాలు, గోదావరిఖనిలోని సీఎంపీఎఫ్ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ కార్మిక సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి పూజారి నర్సయ్య, ఉపాధ్యక్షుడు బూర్ల జ్ఞాని, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఓరం రాధాకృష్ణ, కార్యవర్గ సభ్యులు నారాయణరాజు, ఆడిచర్ల రాజేశం, రామస్వామి, ఒడ్డె పోషం, బిల్ల మల్లయ్య, ఎం.కుమారస్వామి, అంకం చంద్రయ్య, రౌతు నర్సయ్య, ఏ.సత్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment