● నేడు జాతీయ ఓటరు దినోత్సవం ● పౌరులకు రాజ్యాంగం కల్పించ
గుర్తుంచుకోండి..
మీ పురోగతి, మీ సంక్షేమం, మీ సంతోషం కోసం ఎన్నికల్లో ఓటు వేయడంలో ఎప్పుడూ విఫలం కావొద్దు.
– మాజీ రాష్ట్రపతి
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం
నేడు ఓటర్స్ డే ర్యాలీ
బెల్లంపల్లి: 15వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శనివారం బెల్లంపల్లిలో అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు బెల్లంపల్లి ఆర్డీవో పి.హరికృష్ణ ఒక ప్రకటనలో తెలిపా రు. ఉదయం 8.30 గంటలకు తిలక్ స్టేడి యం నుంచి ఏఎంసీ క్రీడా మైదానం వరకు ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రభు త్వ అధికారులు, బీఎల్‌ఓ, ఆర్‌పీలు, విద్యార్థులు, పుర ప్రజలు ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
మంచిర్యాలడెస్క్: ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులను నిర్దేశించేది ఓటరే. అభివృద్ధి వైపు పయనించా లన్నా.. సరైన పాలకులను ఎన్నుకోవాలన్నా ఓట రు చేతిలోనే ఉంది. స్థానిక సంస్థలు, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ప్రలోభాలకు గురికాకుండా ప్రతీ ఓటరు ఓటు హక్కు వినియోగించుకుంటే దేశ భవి ష్యత్‌ను నిర్దేశించే అస్త్రం అవుతుంది. నేడు జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
ఇలా మొదలై..
ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు భా రత ఎన్నికల సంఘం 2011 జనవరి 25నుంచి జా తీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తూ వస్తోంది. 1950 జనవరి 25న ఎన్నికల సంఘం ఏర్పడిన నేపథ్యంలో అందుకు గుర్తుగా జనవరి 25ను ఎంచుకుంది. ‘‘ఓటు లాంటిది ఇంకొకటి లేదు.. నేను ఖ చ్చితంగా ఓటు వేస్తాను’’ అనే నినాదంతో ఈ ఏడా ది 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తోంది.
18 ఏళ్లు నిండాలి..
18ఏళ్లు నిండిన యువతీ, యువకులు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అప్పుడే ఏ ఎన్నికల్లో అయినా ఓటు వేసే హక్కు పొందవచ్చు. ఎన్నికల్లో పోటీకీ అవకాశం ఉంటుంది. 1989 కంటే ముందు 21ఏళ్లు నిండిన వారు మాత్రమే ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉండేది. 1988లో రాజ్యాంగ 61వ సవరణ ద్వారా ఓటరు వయస్సు 18 సంవత్సరాలకు తగ్గించారు. దీంతో 1989 మార్చి 28నుంచి ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం 18ఏళ్లు నిండిన వారు ఓటు వేసే అవకాశం లభించింది. https://voters.eci.gov.in/వెబ్‌సైట్ ద్వారా, యేటా కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.
మొదటి ఓటరు ఇక్కడే..
రాష్ట్రంలోనే మొదటి నియోజకవర్గం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్. ఈ నియోజకవర్గంలోని కాగజ్‌నగర్ మండలం మాలిని గ్రామంలో ఆత్రం రంభబాయి మొదటి ఓటరుగా ఉన్నారు. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని ఓటరు జాబితా ప్రారంభం అవుతుంది.
మహిళలే అధికం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ నియోజ కవర్గాలు ఉన్నాయి. అన్నింటిలోనూ మహిళా ఓట ర్ల సంఖ్యనే అధికంగా ఉంది. పురుష ఓటర్లు 11,37,514మంది ఉండగా.. మహిళలు 11,87, 865మంది ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 50,351మంది ఎక్కువగా ఉన్నారు.
ప్రతీ ఓటు విలువైనదే..
ఎన్నికల్లో ఓటే విజేతను నిర్ణయిస్తుంది. భారీ మెజార్టీ సాధించినా.. ఒక్క ఓటు తేడాతో అయినా గెలుపు గెలుపే. రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి కాలే యాదయ్య 268 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సిర్పూర్ నియోజకవర్గం నుంచి 3088 ఓట్ల స్వల్ప మెజార్టీతో పాల్వాయి హరీష్‌బాబు గెలుపొందారు.
నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు..
నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు సర్వీసు ఓటర్లు మొత్తం
సిర్పూర్ 1,15,323 1,15,811 16 305 2,31,455
ఆసిఫాబాద్ 1,13,815 1,15,813 16 121 2,29,765
చెన్నూర్ 96,964 99,049 7 141 1,96,161
బెల్లంపల్లి 88,109 90,286 13 178 1,78,586
మంచిర్యాల 1,39,306 1,42,421 26 365 2,82,118
ఆదిలాబాద్ 1,21,050 1,26,805 6 248 2,48,109
బోథ్ 1,03,554 1,10,453 2 579 2,14,588
ఖానాపూర్ 1,11,157 1,16,549 14 431 2,28,151
నిర్మల్ 1,23,088 1,37,730 21 248 2,61,087
ముధోల్ 1,25,148 1,32,948 17 293 2,58,406
Comments
Please login to add a commentAdd a comment