విద్యుత్ ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: విద్యుత్ సంస్థలోని ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలని, వెంటనే కన్వర్షన్ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. ఆర్టిజన్లను సంస్థలో కన్వెన్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు మంచిర్యాలలో చేపట్టిన నిరవధిక సమ్మెకు శుక్రవారం బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్‌గౌడ్, నాయకులు వెంకటకృష్ణ, కృష్ణమూర్తి, మురళి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment