క్వారీ లోయల్లో..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఎత్తయిన కొండలు, అటవీ అందాలు, లోయలు పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంటాయి. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గడ్‌పూర్ పరిధిలో ఉన్న ర్యాలీ పరిసర ప్రాంతాలు సెలవు, వారాంతాల్లో సందడిగా మారుతాయి. ఇప్పటికే ఇక్కడ వనదర్శిని పేరుతో అడవులపై అవగాహన, ట్రెక్కింగ్, రాప్లింగ్, నైట్ క్యాంపులు తదితర కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇటీవలే జంగిల్ సఫారీ ప్రారంభించగా ఆదరణ లభిస్తోంది. నేడు జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఇక్కడి సహజ సిద్ధమైన అటవీ ప్రాంతాలు పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నాయి.
– ప్రత్యేక కథనాలు 8లోu
Comments
Please login to add a commentAdd a comment