మిల్లర్ల బకాయితోనే సమస్య
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్‌జోన్: జిల్లా మిల్లర్లు అత్యధికంగా ప్రభుత్వానికి బకాయిపడడంతో ధాన్యం కొనుగోలులో సమస్య ఉత్పన్నం అవుతుందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. గురువారం ధాన్యం కొనుగోళ్లపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 2.15 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే మిల్లర్లకు కేటాయించి, మిగితా ధాన్యం ఇతర జిల్లాలకు కేటాయిస్తామని వివరించారు. కాగా ఇప్పటివరకు 1.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చారన్నారు. తేమశాతం రాలేదని ఈనెల 13వ తేదీ వరకు 39 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. జిల్లాలో ఎక్కడా సమస్య తలెత్తకుండా అప్రమత్తంగా ఉంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ శ్రీనివాసరావు, సివిల్ సప్లై డీఎం హరికృష్ణ, జిల్లా పౌర సరఫరాల అధికారి సురేష్ రెడ్డి, డీసీఓ కరుణ, డీఏఓ గోవింద్ పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్
బాలల దినోత్సవం సందర్భంగా గురువారం పట్ట ణంలోని తెలంగాణ రెసిడెన్షియల్ బాలికల కళాశాల, పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఈసందర్భంగా గ్రౌండ్ బేస్ లెర్నింగ్‌ను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో గ్రౌండ్ బేస్ లెర్నింగ్ విధానాన్ని అమలుపర్చేలా పగడ్బందీ ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం 9వ తరగతి విద్యార్థినులకు భౌతికశాస్త్రం బోధించారు. ప్రశ్నలతో వారి సామర్థ్యాలను పరీక్షించి అభినందించారు. త్వరలో జిల్లాలో సైన్స్, గణిత ఉపాధ్యాయులకు గ్రౌండ్ బేస్ లెర్నింగ్‌పై ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైన్స్ మేళాను సందర్శించి నిర్వాహకులను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment