వారిని కఠినంగా శిక్షించాలి
మెదక్‌జోన్: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్‌తో పాటు అధికారులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా ఉద్యోగ జేఏసీ చైర్మన్, టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్‌లో ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై రైతుల పేరిట కొందరు దాడి చేయడం సరికాదన్నారు. అభ్యంతరాలు ఉంటే గ్రామసభలో వ్యక్తపరచాలని, దాడులు చేయడం సమంజసం కాదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి మినికి రాజ్ కుమార్, ట్రెస, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు మహేందర్‌గౌడ్, పద్మారావు, కలెక్టరేట్ ఏఓలు యూనూస్, బలరాం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment