చదువుతోనే మంచి భవిష్యత్
కౌడిపల్లి(నర్సాపూర్): చదువుతోనే మంచి మంచి భవిష్యత్ ఉంటుందని, విద్యార్థులు ఇష్టంతో కాకుండా కష్టపడి చదవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఇందిర అన్నారు. గురువారం కౌడిపల్లి ఎస్టీ ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు రికార్డులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉండగా నాలుగు నెలలుగా తమకు వేతనాలు రావడం లేదని ఉపాధ్యాయులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. నిధులు మంజూరు కాగానే మీ అకౌంట్లలో జమ చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హెచ్‌డబ్ల్యూఓ జయరాజ్, ఉపాధ్యాయలు పాల్గొన్నారు.
నేడు డయల్ యువర్ డీఎం
నారాయణఖేడ్: ప్రయాణికుల సమస్యలపై ఈనెల 15న శుక్రవారం ఉదయం 10గంటల నుంచి 11గంటల వరకు నారాయణఖేడ్ డిపోలో డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ మల్లేశయ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు, ప్రజలు ఆర్టీసీకి సంబంధించిన సమస్యలు, మరింత మెరుగైన సేవలకుగాను 99592 23170 నంబరుకు ఫోన్ చేసి వివరించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment