సీసీ కెమెరాల పాత్ర కీలకం
ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
మెదక్ మున్సిపాలిటీ: నేర రహిత సమాజంలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఏర్పాటుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు ముందుకురావాలని పిలుపునిచ్చారు. గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న కేసులను సంబంధిత అధికారులు పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులను ప్రతి అధికారి ఛాలెంజ్‌గా తీసుకొని చేధించాలని సూచించారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో నిస్పక్షపాతంగా దర్యాప్తు చేసి నేరస్తులకు శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం జిల్లాలో ఇటీవల పలు కేసులను చేధించడంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. వారిని రివార్డులతో సత్కరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్నకుమార్, వెంకట్‌రెడ్డి, సైబర్ సెక్యూరిటీ డీఎస్పీ సుభాష్‌చంద్రబోస్, ఎస్బీ సీఐ సందీప్‌రెడ్డి, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment