పకడ్బందీగా డేటా ఎంట్రీ
నర్సాపూర్ రూరల్: సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీని పకడ్బందీగా చేపట్టాలని నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ కంప్యూటర్ ఆపరేటర్లకు సూచించారు. శుక్రవారం నర్సాపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో డేటా ఎంట్రీని పరిశీలించి మాట్లాడారు. చిన్న చిన్న పొరపాట్లు జరిగిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఎన్యుమరేటర్లు ఎంతో కష్టపడి సర్వే చేశారని.. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి సర్వే ఫాంను క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ మధులత, సిబ్బంది పాల్గొన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లా
సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపిక
వెల్దుర్తి(తూప్రాన్): జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో మాసాయిపేట ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉమ్మడి మెదక్ జిల్లా ఎస్‌జీఎఫ్ అండర్– 17 బాల, బాలికల సాఫ్ట్‌బాల్ జట్టు ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 40 మంది బాలికలు, 50 మంది బాలురు హాజరుకాగా, 16 మంది చొప్పున రెండు విభాగాల్లో ప్రతిభచాటిన వారిని తుది జట్టుకు ఎంపిక చేశారు. డిసెంబర్‌లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరిగే 68వ రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో వీరు పాల్గొంటారని జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి రమేష్ తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ లీలావతి, హెచ్‌ఎం ధర్మపురి, ఉపాధ్యాయులు రంగారెడ్డి, హరిరంజన్ శర్మ, వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్‌లు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో
వేగం పెంచాలి
పాపన్నపేట(మెదక్): ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌రావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని అర్కెల, నార్సింగి ఐకేపీ కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనలకు అనుగుణంగా తేమశాతం మించకుండా రైతులు చర్యలు తీసుకోవాలన్నారు. సీరియల్ ప్రకారం ధాన్యం తూకాలు జరపాలని నిర్వాహకులకు సూచించారు. లారీలు వెంట వెంటనే లోడ్ అయ్యేలా హమాలీలను సమాయత్తం చేయాలన్నారు. లారీలు ఆలస్యం జరిగితే తమ దృష్టికి తేవాలన్నారు. ఆయన వెంట ఏపీఎం సాయిలు, డ్వాక్రా గ్రూపు మహిళలు, రైతులు ఉన్నారు.
94 శాతం సర్వే పూర్తి
చేగుంట(తూప్రాన్)/చిన్నశంకరంపేట(మెదక్): జిల్లాలో 94 శాతం సమగ్ర ఇంటింటి సర్వే పూర్తయిందని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య తెలిపారు. శుక్రవారం చేగుంట మండల పరిషత్ కార్యాలయంలో సర్వే కంప్యూటరీకరణను పరిశీలించారు. ఈసందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. సాధ్యమైనంత త్వరగా సర్వే వివరాలు నమోదు చేయాలన్నారు. నిత్యం పర్యవేక్షించాలని ఎంపీడీఓ చిన్నారెడ్డికి సూచించారు. ఆయన వెంట ఆర్డీఓ జయచంద్రారెడ్డి, సిబ్బంది ఉన్నారు. అలాగే చిన్నశంకరంపేట మండల పరిషత్ కార్యాలయంలో డేటా నమోదు ప్రక్రియను పరిశీలించారు.
మత్తు పదార్థాలతో
జీవితాలు నాశనం
పాపన్నపేట(మెదక్): యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి బంగారు జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ సూచించారు. శుక్రవారం ఏడుపాయల్లో జై భీం సంఘం ఆధ్వర్యంలో నిర్వహి ంచిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో యువత గంజాయి, డ్రగ్స్, మద్యపానం, ఇతర మత్తు పదార్థాలకు అల వాటు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. కార్యక్రమంలో జైభీం జిల్లా అధ్యక్షుడు పా తూరి రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ సామెల్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నోముల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment