మెరుగైన ఫలితాలు సాధించాలి
చిన్నశంకరంపేట(మెదక్): ఇంటర్‌లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారిణి మా ధవి సూచించారు. గురువారం నార్సింగి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేసి మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివితేనే సత్ఫలితాలు వస్తాయ న్నారు. గతేడాది ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు సాధించాని అధ్యాపకులను ఆదేశించారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ నరేందర్‌గౌడ్‌కు పలు సూచనలు చేశారు.
రాజీయే రాజమార్గం
మెదక్ కలెక్టరేట్: రాజీయే రాజమార్గమని, ఈనెల 14వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకో వాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద అన్నారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. రాజీ పడటం వల్ల ఇరువర్గాలు గెలిచినట్లేనని అన్నారు. సివిల్, క్రిమినల్, కుటుంబ తగా దాలు, మోటార్ వెహికల్.. తదితర కేసుల్లో కక్షిదారులు రాజీ చేసుకునే అవకాశం ఉందన్నా రు. లోక్ అదాలత్‌లో ఎక్కువ మొత్తంలో కేసు లు రాజీకుదుర్చుకునేలా పోలీసులు, న్యాయవాదులు కృషి చేయాలని సూచించారు.
‘ఇందిరమ్మ’ సర్వే అడ్డగింత
కౌడిపల్లి(నర్సాపూర్): ఇందిరమ్మ ఇళ్ల సర్వేను కాంగ్రెస్ నాయకులతో కలిసి చేయడం ఏంటని బీఆర్‌ఎస్ నాయకులు సర్వేను అడ్డుకున్నారు. ఈసంఘటన మండలంలోని ధర్మాసాగర్‌లో జరిగింది. గురువారం గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నరహరి సర్వేను ప్రారంభించగా.. ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గ్రామస్తులకు కనీసం సమాచారం ఇవ్వకుండా, కాంగ్రెస్ నాయకులతో కలిసి సర్వే ఎలా చేస్తారని పంచాయతీ కార్యదర్శిని బీఆర్‌ఎస్ నాయకులు ప్రశ్నించి సర్వేను అడ్డుకున్నారు. ఈసందర్భంగా పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ.. అధికారులు ఇందిరమ్మ కమిటీ సభ్యులకు సమాచారం ఇవ్వమన్నారని తెలిపారు. కాగా మొదటి రోజు ఐదు ఇళ్ల సర్వే చేశామని చెప్పారు.
చంటి పిల్లలతో సమ్మెలో..
మెదక్ కలెక్టరేట్: సమగ్ర శిక్షా మహిళా ఉద్యో గులు గురువారం తమ పిల్లలతో కలిసి నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకొని తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి నేడు విస్మరించ డం సరికాదన్నారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఆయిల్‌పామ్ సాగుకు
ముందుకు రావాలి
గజ్వేల్: ఆయిల్‌పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని ఏడీఏ బాబునాయక్ అన్నా రు. గురువారం ఆహ్మదీపూర్‌లో రైతులకు వ్య వసాయశాఖ ఆధ్వర్యంలో అవగాహన స దస్సు జరిగింది. ఈ సందర్భంగా ఏడీఏ మా ట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు వల్ల రైతులకు పెట్టుబడులు తగ్గి నికర ఆదాయం పెరుగుతుందని చెప్పారు. మొదటి మూడేళ్లు ఈ తోటల్లో అంతర పంటలతో సాగుతో ఆదా యం పొందే అవకాశం ఉంటుందని, నాలుగో ఏడాది నుంచి ఆయిల్‌పామ్ నుంచి ఆదాయం ప్రారంభమవుతుందన్నారు. ఆయిల్‌ఫెడ్ సంస్థ జిల్లా ఇన్‌చార్జి అనిల్‌కుమార్ మాట్లాడుతూ ఆయిల్‌పామ్ సాగు చేయాలనుకునే రైతులు తమ పరిధిలోని ఏఈఓల వద్ద వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సదస్సులో ఏఓ నాగరాజు, ఏఈఓ అనూష, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment