హుస్నాబాద్: దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం అంటే రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల సీపీఐ రాష్ట్ర సహా కా ర్యదర్శి బాలమల్లేశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోటు ప్రసాద్ మృతిచెందగా.. శనివారం పట్టణంలోని అనబేరి, సింగిరెడ్డి అమరుల భవన్‌లో వారి చిత్రపటాలకు పూలమాల లు వేసి నివాళులర్పించారు. అనంతరం చాడ మా ట్లాడుతూ అదానీ అవినీతిపై జాయింట్ కమి టీ వేయాలని పార్లమెంట్‌లో కోరినా అరణ్య రోదనగానే మిగిలిందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా బీజేపీ ప్రభుత్వం మాట తప్పిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో ఒడిదొడుగులను ఎదుర్కొంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment