విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం
నర్సాపూర్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శనివారం మండలంలోని నారాయణపూర్ గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో కామన్ మెనూ డైట్‌ను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వసతి గృహాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 80 ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనుల పండువగా కామన్ డైట్ మెనూను ప్రారంభించినట్లు వివరించారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను అందిపుచ్చుకొని చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్ లలితాదేవి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
25న కేవీకేకు ఉపరాష్ట్రపతి రాక
కౌడిపల్లి(నర్సాపూర్): ఈనెల 25వ తేదీన మండలంలోని తునికి వద్ద గల డాక్టర్ రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)కు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు రానున్నారు. దీంతో శనివారం కలెక్టర్ రాహుల్‌రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ కేవీకేను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. సేంద్రియ సాగు గురించి కేవీకే హెడ్ అండ్ సైంటిస్ట్ శంభాజి దత్తాత్రేయ నల్కర్, శాస్త్రవేత్తలు కలెక్టర్‌కు వివరించారు.
కలెక్టర్ రాహుల్‌రాజ్
గిరిజన బాలికల పాఠశాలలో
కామన్ డైట్ మెనూ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment