నిధులు లేక.. పనులు సాగక
నర్సాపూర్ మున్సిపాలిటీలో నిలిచిన నిర్మాణాలు
నర్సాపూర్: ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిధుల విడుదలపై ఫ్రీజింగ్ అమలు చేసింది. దీంతో నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. పట్టణంలో రూ. 5 కోట్లతో మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణం చేపట్టారు. పనులు చివరి దశకు చేరుకోగా.. కాంట్రాక్టర్‌కు బిల్లులు రాకపోవడంతో సుమారు ఏడాది నుంచి మిగిలిన పనులు నిలిపివేశారు. మున్సిపల్ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడంతో మహిళా భవనంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆరున్నర కోట్ల రూపాయలతో పట్టణంలో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ యార్డు నిర్మాణ పనులు చేపట్టారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు బిల్లులు రాకపోవడంతో సుమారు ఏడాదిన్నర నుంచి పనులు నిలిపివేశారు. అలాగే సుమారు రూ. 2 కోట్లతో చేపట్టిన మోడల్ దోబీఘాట్, సుమారు నాలుగేళ్ల క్రితం చేపట్టిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ పనులు నిలిచిపోయాయి.
నిధులు విడుదల చేయాలని కోరాం
పట్టణంలో నిధులు లేక నిలిచిన ప్రభుత్వ భవనాల నిర్మాణాలను పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ, మంత్రి దామోదరను కోరాం. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే పనులు ప్రారంభించి భవనాల నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
– అశోక్‌గౌడ్,
నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment