విద్యార్థులకు పౌష్టికాహారం
అదనపు కలెక్టర్ నగేష్
కౌడిపల్లి(నర్సాపూర్): విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. శనివారం కౌడిపల్లి ఎస్టీ అశ్రమ పాఠశాలలో కామన్ డైట్ మెనూను ప్రారంభించారు. పాఠశాలలో తరగతి గదులు, కిచెన్, డైనింగ్‌హాల్, మరుగుదొడ్లు పరిశీలించారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెలలో నాలుగుసార్లు చికెన్, రెండుసార్లు మటన్‌ను మధ్యాహ్న భోజనంలో పెట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జయరాజ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే తునికి ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలో హైదరాబాద్ ఎస్‌బీ డీసీపీ చైతన్యకుమార్ పాల్గొని కొత్త మెనూను ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హరిబాబు, డీఎల్‌పీఓ సాయిబాబ, ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పర్యాటక కేంద్రంగా
ఏడుపాయల
పాపన్నపేట(మెదక్): తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల పుణ్యక్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తానని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు అన్నారు. శనివారం వన దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈఓ చంద్రశేఖర్ ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి సత్కరించారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏడుపాయల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరామన్నారు. పర్యాటక కేంద్రంగా మార్చేందుకు త్వరలో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని తెలిపారు. భక్తులకు అవసరమైన సత్రాలు నిర్మిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, నర్సింలు, ఇంద్రసేనారెడ్డి, భరత్‌రెడ్డి పాల్గొన్నారు.
సమస్యలు
పరిష్కరించే వరకు సమ్మె
మెదక్ కలెక్టరేట్: కలెక్టరేట్ ఎదుట చేపట్టిన సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె శనివారం 4వ రోజుకు చేరుకుంది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. నోటిఫికేషన్ ద్వారా ఎంపికై 22 ఏళ్లుగా సమగ్ర విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నా.. ప్రభుత్వాలు గుర్తించకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment