1,816 కేసుల పరిష్కారం
మెదక్‌జోన్: జాతీయ లోక్ అదాలత్‌లో 1,816 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి లక్ష్మీశారద తెలిపారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆమె మాట్లాడుతూ.. క్రిమినల్, సివిల్, మోటార్ వాహనాలు, బ్యాంక్, పైనాన్స్, కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. అనంతరం ఉచిత న్యాయ సలహాకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్జిలు జితేందర్, సిరి సౌజన్య, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సు భాష్ చంద్రాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్‌లో 139 కేసులు
నర్సాపూర్: జాతీయ లోక్ అదాలత్‌లో ఆయా విభాగాలకు చెందిన 139 కేసులు పరిష్కరించినట్లు మెదక్ లోక్ అదాలత్ ఇన్‌చార్జి రుబీనా ఫాతిమా తెలిపారు. శనివారం కోర్టు ఆవరణలో ఆమె మాట్లాడుతూ.. కోర్టు చుట్టూ తిరిగి సమయం వృథా చేసుకోకుండా రాజీపడి కలిసి మెలిసి ఉండాలని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment