విద్యార్థుల సమస్యలు పట్టని సర్కార్
● ఆరు నెలలుగా మెస్ బిల్లులు లేవు ● నాణ్యమైన ఆహారం లేదు.. ● దీనావస్థకు చేరుకున్న హాస్టళ్లు, గురుకులాలు ● ఎమ్మెల్యే హరీశ్‌రావు ఫైర్ ● సిద్దిపేటలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ సందర్శన
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ దీనావస్థకు చేరుకుందని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సమీకృత వసతిగృహాన్ని సందర్శించారు. ముందుగా విద్యార్థుల గదులు, వంటశాల, బియ్యం, అన్నం, కూరలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులు, వార్డెన్‌లు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రేంవత్‌రెడ్డి పాలనలో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు దీనాస్థకు చేరుకున్నాయన్నారు. కాంగ్రెస్ పాలనలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 49 మంది విద్యార్థులు కలుషిత ఆహారంతో మృతి చెందారని, వేలాది మంది విద్యార్థులు ఆస్పత్రుల పాలయ్యారన్నారు. మూడు లక్షల కోట్ల బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం కోసం నిధులు లేవా అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో వెయ్యి గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించామన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆరు నెలలుగా మెస్ బిల్లులు, కాస్మోటిక్ చార్జీలు చెల్లించడం లేదన్నారు. సిద్దిపేటలోని ఈ ఒక్క హాస్టల్‌కే రూ.9.5లక్షల మెస్‌బిల్లులు రావాలన్నారు. నాణ్యమైన ఆహారం అందించకుంటే బాధ్యత వార్డెన్లు, ప్రధానోపాధ్యాయులు వహించాలని ముఖ్యమంత్రి అంటున్నారని, తప్పు ము ఖ్యమంత్రిది, శిక్షలు వీరికా అని అన్నారు. ప్రశ్నిస్తే ప్రతిపక్షాలను ఆరెస్టులు చేయడం, అక్రమ కేసులు బనాయించడం చేస్తున్నారన్నారు. ఇప్పటికై నా వసతిగృహాల మెస్ బిల్లులు విడుదల చేయాలన్నా రు. అంతకు ముందు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment