ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
చిన్నశంకరంపేట(మెదక్): ప్రజలకు అత్యవసర వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకే మండ లానికో 108ను ఏర్పాటు చేసినట్లు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నూతన 108ను ప్రారంభించారు. అనంతరం అస్పత్రిని పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా మెడికల్ ఆఫీసర్‌కు సూచనలు చేశారు. అలాగే తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆశావర్కర్లు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. సంగాయిపల్లిలో తాగునీటి సమస్య నెలకొందని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ల గా మిషన్ భగీరథ డీఈకి ఫోన్ చేసి వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రామాయంపేట(మెదక్): మండలంలోని అక్కన్న పేట అటవీ ప్రాంతంలో నగర వనయోజన పథకం కింద అర్బన్ పార్కు ఏర్పాటు కోసం పలు అభివృద్ధి పనులను గురువారం ఎమ్మెల్యే రోహిత్‌రావు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా జిల్లా అటవీశాఖ అధికారి జోజి, రేంజ్ అధికారి విద్యాసాగర్‌తో మాట్లాడి జంతువుల విషయమై ఆరా తీశారు. అంతకుముందు అక్కన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. స్కూల్‌లో ఏమైనా సమస్యలున్నాయా..? ఉపాధ్యాయులు సక్రమంగా విధులకు హాజరవుతున్నారా..? భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, జిల్లా నాయకులు గోపాల్‌రెడ్డి, హన్మంతరావు, యూత్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శులు రమేశ్, కుమార్ సాగర్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు యుగంధర్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment