నాణ్యమైన ఆహారం తప్పనిసరి
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్‌జోన్/పాపన్నపేట(మెదక్): విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, విద్యాసంస్థల్లో ఎట్టి పరిస్థితుల్లో ఫుడ్ పాయిజన్ కావొద్దని కలెక్టర్ రాహుల్‌రాజ్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయ మాట్లాడారు. సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల మధ్యాహ్న భోజనం కోసం డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచినట్లు తెలిపారు. ఈనెల 14వ తేదీ నుంచి పెంపు అమల్లోకి వస్తుందన్నారు. ఆరోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సంక్షేమ వసతి గృహాల్లో పాఠశాలల్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేస్తారని చెప్పారు. ఇందుకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ముందస్తు ఆహ్వానం పంపాలన్నారు. వంట పదార్థాలలో నా ణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఈఓ రాధాకిషన్, ఎంఈఓలు, వసతి గృహాల వార్డెన్లు, హెచ్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి ప్రాథమిక ఆ రోగ్యం కేంద్రాన్ని సందర్శించారు. వైద్యులు, ఇతర సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. గైర్హాజరైన ఉద్యోగుల విషయమై జిల్లా వైద్యశాఖ అధికారికి ఫోన్ చేసి ఆరా తీశారు. వెంటనే నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అలాగే యూసూఫ్‌పేటలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించారు. పారదర్శకంగా సర్వేను నిర్వహించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment