ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశాలత
మహిళలపై
దాడులు ఆగేదెన్నడు?
గజ్వేల్‌రూరల్: మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో పాలకులు విఫలమయ్యారని ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశాలత ఆరోపించారు. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా గురువారం గజ్వేల్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడుతూ రోజురోజుకు మహిళలపై హత్యాచారాలు, దాడులు, గృహింస పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశం నలుమూలల ప్రతి నిత్యం పదుల సంఖ్యలో మహిళలపై హత్యాచారాలు జరుగుతున్నాయని, వీటిని నిరోధించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. మహిళలను వంటింటికే పరిమితం చేయాలని, వారిని తక్కువగా చూసే విధంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సామాజిక, భౌతిక దాడులు, దౌర్జన్యాలతో మహిళలు జీవించే హక్కు ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment