వంట.. తంటా!
శనివారం శ్రీ 14 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
ఐదు నెలలుగా అందని బిల్లులు
మధ్యాహ్న భోజన పథకం అమలుకు బిల్లుల బకాయిలు గుదిబండలా మారాయి. నెలల తరబడి బిల్లులు రాక నిర్వాహకులు నానా పాట్లు పడుతున్నారు. అప్పులు చేసి మరీ విద్యార్థులకు భోజనాలు పెడుతున్నారు. ఈ క్రమంలో వడ్డీలు పెరిగిపోతుండడంతో ఏం చేయాలో పాలుపోని దుస్థితిలో ఉన్నారు.
కూచన్‌పల్లి పాఠశాలలో వంట చేస్తున్న నిర్వాహకులు
మెదక్‌జోన్: జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు 878 ఉండగా, అందులో 66 వేల పైచిలుకు విద్యార్థులు చదువుకుంటున్నారు. కాగా వీరిలో 1 నుంచి 5వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి మధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వం రోజుకు రూ. 5.45 చెల్లిస్తోంది. 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు రూ. 8.17, 9 నుంచి పదో తరగతి విద్యార్థులకు రోజుకు రూ. 10.67 ఇస్తున్నారు. ఇందులో 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు సెప్టెంబర్, నవంబర్ రెండు నెలలకు కలిపి మొత్తం రూ.1.67 కోట్ల బిల్లులు నిర్వాహకులకు రావాల్సి ఉంది. అలాగే 9, 10 తరగతి విద్యార్థులకు జూలై నుంచి నవంబర్ వరకు రూ. 2.45 కోట్లు బకాయి పడ్డారు. మొత్తం రూ. 4.14 కోట్లు వంట నిర్వాహకులకు చెల్లించాల్సి ఉండగా.. ఇటీవల రూ. 1.67 కోట్లు మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. మిగితా రూ. 2.45 కోట్ల మేర బిల్లులు రావాల్సి ఉంది.
విద్యార్థులకు నాణ్యత లేని భోజనం
ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థులంతా పేద కుటుంబాలకు చెందినవారే. వీరిపై ఉన్నతాధికారులు సరైన దృష్టి సారించకపోవడంతో నాణ్యమైన భోజనం అందడం లేదు. మధ్యాహ్న భోజనంతో పాటు నెలలో 15 రోజుల పాటు కోడి గుడ్డు అందించాలి. కానీ ఒక్కో గుడ్డు బయట మార్కెట్‌లో రూ. 7 ధర పలుకుతోంది. ప్రభుత్వం వంట నిర్వాహకులకు ఒక్కో గుడ్డుకు కేవలం రూ. 5 మాత్రమే ఇస్తుంది. ఈ లెక్కన జిల్లాలో 66 వేల మంది విద్యార్థులకు నెలకు 33 వేల గుడ్లు పంపిణీ చేయాల్సి ఉండగా, అందులో సగం కూడా ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు రూ. 2 తక్కువ ఇవ్వడంతో నిర్వాహకులు మధ్యాహ్న భోజనంలో గుడ్డు కోత విధిస్తున్నారు. దీంతో విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
కల నెరవేరిన వేళ.. పోలీస్ కావాలని కలగన్నారు. కష్టపడి కొలువు సాధించారు. శిక్షణ పూర్తి చేసుకొని ప్రస్తుతం విధుల్లో చేరారు. వివరాలు 8లో u
న్యూస్‌రీల్
అప్పులపాలవుతున్నాం
ఐదు నెలలుగా మఽ ద్యాహ్న భోజన బిల్లులు రాకపోవడంతో అప్పు చేసి కిరాణ సామగ్రితో పాటు కోడిగుడ్లు కొను గోలు చేయాల్సి వస్తోంది. తీసుకున్న అప్పులకు వడ్డీ పెరిగిపోతోంది. ఇప్పటికై నా ప్రతి నెలా మొదటి వారంలో బిల్లులు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– ఏసమ్మ,
వంట నిర్వాహకురాలు, కూచన్‌పల్లి
Comments
Please login to add a commentAdd a comment