పాడి పశుపోషణతో ఆదాయం
కొల్చారం(నర్సాపూర్): పాడి పశుపోషణతో రైతు లకు అధిక ఆదాయం వచ్చేలా పూర్తి సహకారం అందిస్తామని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని వరిగుంతంలో పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా పాడి పశువుల పెంపకం, పోషణపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు. తక్కువ ఖర్చుతో మేలు జాతి ఆడదూడలను అందించి రైతుకు ఆదాయాన్ని సమకూర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా పశువులకు గర్భధారణ పరీక్షలు, సాధారణ చికిత్స, దూడలకు నట్టల నివారణ మందు వేశారు. కార్యక్రమంలో పశు వైద్యాధికారులు వీరేశం, రాజు, సూపర్ వైజర్ శ్రీనివాస్‌రెడ్డి, వెటర్నరీ అసిస్టెంట్ గట్టయ్య, లైవ్‌స్టాక్ అసిస్టెంట్ వేణుగోపాల్, సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు.
జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య
Comments
Please login to add a commentAdd a comment