ఆటపాటలతో విద్యాబోధన
శివ్వంపేట(నర్సాపూర్): అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఆట పాటలతో విద్యా బోధన చేయా లని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి హైమా వతి అన్నారు. మండల పరిధిలోని దొంతిలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం బాలమేళా నిర్వహించారు. ఈసందర్భంగా చిన్నారులు తయా రు చేసిన మట్టిపాత్రలు, స్టోరీ థియేటర్, పలు వస్తువులను ప్రదర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నతనంలో పిల్లల మేదస్సు పెంపొందించడంలో అంగన్‌వాడీ టీచర్ల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వం కేంద్రాలకు ఇస్తున్న పౌష్టికాహారం సక్రమంగా ఇవ్వాలని సూచించారు. విద్యార్ధుల్లో దాగి ఉన్న నైపుణ్యం వెలుగులోకి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో సీడీపీఓ హేమాభార్గవి, సూపర్ వైజర్లు సంతోష, వసుమతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment