సంగారెడ్డి ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తు న్న కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలని, హక్కుల సాధన కోసం అందరం ఉద్యమించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ పేర్కొన్నారు. సంగారెడ్డిలోని కేవల్‌కిషన్ భవన్‌లో శుక్రవారం జరిగిన సీఐటీయూ జిల్లా కమిటీ సమావేశం మల్లిఖార్జున్ పాల్గొని మాట్లాడారు. కార్మికులు తమ హక్కుల కోసం పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కాలరాసిందన్నారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్ తెచ్చారని దుయ్యబట్టారు. వేతనాల కోసం, హక్కుల కోసం పోరాడకుండా కార్మిక వర్గాన్ని బానిసలు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లేశ్, సా యిలు నాయకులు రాజయ్య, పాండురంగారెడ్డి త దితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment