నల్లపోచమ్మ హుండీ ఆదాయం రూ. 5.98 లక్షలు
కౌడిపల్లి(నర్సాపూర్): మండలంలోని తునికి నల్లపోచమ్మదేవి ఆలయం హుండీ ఆదాయం రూ. 5,98,690 వచ్చినట్లు ఉమ్మడి మెదక్ జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం ఆలయంలో ఈఓ రంగారావు ఆధ్వర్యంలో అధికారులు, భ క్తుల సమక్షంలో ఐదు నెలలకు సంబంధించిన హుండీ ఆదాయం లెక్కించారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ వెంకట్‌రెడ్డి, ఆలయ మాజీ చైర్మన్లు చెల్ల మల్లేశం, శ్రీనివాస్‌రెడ్డి, మాజీ డైరెక్టర్ ప్రభాకర్‌చారి, రాజరాజేశ్వరీదేవి సేవాసంస్థ కోఆర్డినేటర్ సునీతారెడ్డితో పాటు కామారెడ్డి, కరీంనగర్‌కు చెందిన 30 మంది సేవకులు, భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
మా సమస్యలు పరిష్కరించండి
రామాయంపేట(మెదక్): సమస్యల సాధన కోసం కార్మికులు శుక్రవారం రామాయంపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి మాట్లాడుతూ.. కార్మికులు నామమాత్రపు వేతనాలతో వెట్టిచాకిరి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది దుస్తులు, నూనె, సబ్బులు, చెప్పులు, మాస్కులు ఇవ్వాల్సి ఉండగా సక్రమంగా ఇవ్వ డం లేదని ఆరోపించారు. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకొని మున్సిపల్ కార్మికులకు వసతులు సమకూర్చకపోతే అందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
నేడు నర్సాపూర్‌లో మంత్రి
కొండా సురేఖ పర్యటన
నర్సాపూర్: జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ శనివారం నర్సాపూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు అర్బన్ పార్కును సందర్శించి మొ క్కలు నాటుతారు. అనంతరం నియోజకవర్గంలోని హత్నూర మండల కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల జూనియర్ కాలేజీని తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారని అధికారులు తెలిపారు.
పాత పెన్షన్ విధానం అమలు చేయాలి
పాపన్నపేట(మెదక్): పాత పెన్షన్ విధానం అమలు చేయాలని తెలంగాణ కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింలు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారని గుర్తుచేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున తీర్మానం వ్రవేశపెట్టాలని కోరారు. ఇప్పటికై నా సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.
నేడు విద్యుత్
సరఫరాలో అంతరాయం
మెదక్ మున్సిపాలిటీ: మెదక్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ట్రాన్స్‌కో ఏడీఈ మోహన్‌బాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాతూర్, మక్తభూపతి పూర్, రాజ్‌పల్లి సబ్‌స్టేషన్లలో మరమ్మతులు చేయనున్న నేపథ్యంలో వీటి పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. ఆయా గ్రామాల ప్రజలు సహకరించాలని కోరారు.
పెండింగ్ వేతనాలుచెల్లించాలని వినతి
మెదక్ కలెక్టరేట్: మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బస్వరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో డీఆర్‌ఓకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికులు అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారని వాపోయా రు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment