అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
కలెక్టర్ రాహుల్‌రాజ్
చిన్నశంకరంపేట(మెదక్): ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పిదాలకు తావివ్వకుండా అర్హులకు లబ్ధి చేకూర్చాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం మండలంలోని టీ.మాందాపూర్‌లో నిర్వహిస్తున్న ఇందిరమ్మ సర్వేను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా యాప్‌లో తానే స్వయంగా వివరాలు నమోదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 469 గ్రామ పంచాయతీలతో పాటు నాలుగు మున్సిపాలిటీల పరిధిలోని 75 వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతుందన్నారు. మొదటి విడతగా నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఇందులో ఎలాంటి పక్షపాతానికి తావు లేకుండా సర్వే ద్వారా లబ్ధిదారులను గుర్తించాలని ప్రభుత్వం యాప్ ద్వారా సర్వే నిర్వహిస్తుందని చెప్పారు. ఈసందర్భంగా ఎంపీడీఓ దామోదర్, గ్రామ కార్యదర్శి కుమార్‌కు పలు సూచనలు చేశారు.
నేడు సంక్షేమ హాస్టళ్ల సందర్శన
మెదక్ కలెక్టరేట్: నేడు జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టళ్లలో మెస్ చార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపా రు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన తాగునీరు అందించాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని అధికారులంతా సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనిసూచించారు.
Comments
Please login to add a commentAdd a comment