సీఎంకప్‌ను విజయవంతం చేద్దాం
మెదక్ కలెక్టరేట్: సమన్వయంతో పనిచేసి సీఎం కప్ పోటీలను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జి ల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో వ్యాయామ ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 17వ తేదీన జిల్లా కేంద్రంలో జిల్లాస్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి కమిటీలతో పాటు క్రీడాకారులకు మధ్యాహ్న భోజన వసతి ఏర్పాటు చేయాలని సూచించారు. క్రీడాకారులు ఉదయం 8 గంటలకల్లా హాజరయ్యే విధంగా చూడాలని ఎంపీడీఓలను ఆదేశించారు. జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజు, పీడీలు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ నగేష్
Comments
Please login to add a commentAdd a comment