ఇచ్చిన మాట నిలబెట్టుకోండి
మెదక్ కలెక్టరేట్: తమను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని సమగ్ర శిక్షా ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట వారు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాల్గవ రోజుకు చేరుకుంది. సమ్మెలో కేజీబీవీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈసందర్భంగా శివ్వంపేట కేజీబీవీ ఉపాధ్యాయురాలు స్వరూపారాణి మాట్లాడుతూ.. 22 ఏళ్లుగా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించి మా కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడం లేదని, కేవలం సమస్యల సాధన కోసమే సమ్మె బాట పట్టినట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా సమస్యలపై స్పందించకపోవడం అన్యాయం అన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు, కార్యదర్శి పాషా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment