డ్రగ్స్ రహితసమాజాన్ని నిర్మిద్దాం
● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ● ధర్మారంలో 2కే రన్
మిరుదొడ్డి(దుబ్బాక): డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత పాటు పడాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్స్, సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మండల పరిధిలోని ధర్మారంలో 2కే రన్‌ను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ప్రారంభించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం తన వంతు కృషి చేస్తామంటూ యువకుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత డ్రగ్స్‌కు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. కార్యక్రమంలో రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ యూత్ ఫోర్స్ ఆర్గనైజర్ తోట కమలాకర్‌రెడ్డి, సిద్దిపేట రన్నర్స్ ఆసోసియేషన్ ప్రతినిధి నునిగాని రాజు, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, ఏఎంసీ మాజీ చైర్మన్ వల్లాల సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment