గజ.. గజ
8లో
– పర్చా శ్రీనాఽథ్
– రామచంద్రాపురం(పటాన్‌చెరు)
● జిల్లాలో పెరిగిన చలి తీవ్రత
● ఉదయం తొమ్మిది దాటినా
వీడని మంచు
● పడిపోతున్న ఉష్ణోగ్రతలు
మెదక్‌జోన్: జిల్లాలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. కొన్ని రోజులుగా సాధారణ ఉష్ణోగత్రలు నమోదై వెచ్చదనం ఉంది. కానీ రెండు, మూడు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. జిల్లాలో అత్యల్పంగా 9 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల వరకు పొగమంచు ఉంటుండగా.. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులు, పాలు, కూరగాయల వ్యాపారులు, పేపర్ బాయ్స్‌కు అవస్థలు తప్పడం లేదు. ఉదయం వాకింగ్‌కు వెళ్లే వారు చలి తీవ్రత అధికంగా ఉండడంతో ఇళ్లకే పరిమితం అవుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. కాగా వెచ్చదనం కోసం గ్రామీణ ప్రాంత ప్రజలు చలి మంటలు కాచుకుంటున్నారు. నవంబర్ నాలుగో వారంలో జిల్లాలో 11.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈనెల మొదటివారంలో తుఫాన్ ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురిశాయి. దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకు పైగా నమోదై చలి తీవ్రత తగ్గింది. తాజాగా కనిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా 9 డిగ్రీలకు పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. రాష్ట్రంలో ఆదిలాబాద్ తర్వాత మెదక్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమో దవుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
ఐదు రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలు
తేదీ కనిష్ట గరిష్ట
09 19.9 32.9
10 19.1 34.7
11 14.0 33.4
12 9.4 33.3
13 11.9 33.5
Comments
Please login to add a commentAdd a comment