పిల్లల ఆహారంపై శ్రద్ధ అవసరం
అదనపు కలెక్టర్ నగేష్
కొల్చారం(నర్సాపూర్): వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు అందించే ఆహారం పట్ల సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ సిబ్బందిని ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా వంట గదిలోకి వెళ్లి ఆహార పదార్థాలతో పాటు ఉపయోగిస్తున్న సామగ్రిని పరిశీలించారు. వంట గదితో పాటు వంట కోసం ఉపయోగించే పాత్రలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. వారికి అందుతున్న వసతులపై ఆరా తీశారు. భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా ముందుకు సాగాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ గఫార్ మియా, ఆర్‌ఐ ప్రభాకర్, పాఠశాల సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment