రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
వెల్దుర్తి(తూప్రాన్): ఈనెల 31వ తేదీ నుంచి వరంగల్‌లో జరిగే రాష్ట్రస్థాయి సీఎం కప్ అథ్లెటిక్స్ పోటీలో పాల్గొనే జిల్లా జట్టులో మాసాయిపేట ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి శ్రీనిధికి చోటు దక్కిందని హెచ్‌ఎం ధర్మపురి తెలిపారు. శనివారం విద్యార్థిని సత్కరించి అభినందించారు. అనంతరం హెచ్‌ఎం మాట్లాడుతూ.. సీఎం కప్ జిల్లాస్థాయి అథ్లెటిక్స్ సబ్ జూనియర్ విభాగంలో శ్రీ నిధి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించిందని కొనియాడారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు శ్యాం సుందర్‌శర్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment