పర్యాటక క్షేత్రంగా ఏడుపాయల
● రూ. 35 కోట్ల మంజూరుకు సీఎం హామీ ● మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల అభివృద్ధికి రూ. 35 కోట్లు మంజూరు చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. ఈనెల 25వ తేదీన మెదక్ చర్చి, ఏడుపాయల సందర్శనకు సీఎం వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఏడుపాయలలో శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. మొదట దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ విజ్ఞప్తి మేరకు ఏడుపాయల చరిత్రలో మొదటిసారిగా సీఎం వస్తున్నారని చెప్పారు. ఏడుపాయలను పర్యాటక క్షేత్రంగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటారని తెలిపారు. రాజకీయాలు మాని అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సీఎం పర్యటనను విజయవంతం చేయడానికి కార్యకర్తలు, అధికారులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మెదక్, దుబ్బాక, సిద్దిపేట ఇన్‌చార్జిలు ఆంజనేయులు, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, హరికృష్ణ, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప, మండల శాఖ అధ్యక్షులు గోవింద్ నాయక్, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment