● సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు
చుక్కా రాములు డిమాండ్
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఆశ వర్కర్లకు ఫిక్స్‌డ్ వేతనం రూ.18 వేలతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్త జాత డిసెంబర్ 15న నిర్మల్‌లో ప్రారంభమై వివిధ జిల్లాలు తిరుగుతూ శనివారం సంగారెడ్డికి చేరుకుంది. ఈ జాతకు ఆశ వర్కర్లు కలెక్టర్ కార్యాలయం వద్ద స్వాగతం పలుకుతూ శ్రద్ధ స్కూలు వరకు ప్రదర్శనగా వెళ్లి అనంతరం అక్కడ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ ఆశా వర్కర్స్ గత 19ఏళ్ల నుంచి అనేక రకాల సేవలు అందిస్తున్న ప్రభుత్వాలు వీరికి కనీస వేతనం ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ 18 వేలు ఇస్తామని అది నేటికి అమలు కాలేదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య, ఆశా వర్కర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి పాల్గొన్నారు.
కార్పొరేట్ సంస్థలకు
కేంద్రం ఊడిగం
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు
జూలకంటి రంగారెడ్డి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: రైతాంగ సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డిలోని కేవల్ కిషన్‌భవన్‌లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం రైతాంగానికి గిట్టుబాటు ధర లు కల్పించకుండా, కార్పొరేట్ కంపెనీలకే వత్తాసు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 11 ఏళ్ల కాలంలో లక్షా 80 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని, ప్రతీ రైతుకు రుణమాఫీ చేసి రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment