మెతుకుసీమకు ప్రముఖుల రాక | - | Sakshi
Sakshi News home page

మెతుకుసీమకు ప్రముఖుల రాక

Published Sun, Dec 22 2024 10:29 AM | Last Updated on Sun, Dec 22 2024 10:29 AM

మెతుక

మెతుకుసీమకు ప్రముఖుల రాక

ఆదివారం శ్రీ 22 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2024
నేడు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ
● 25న ఉపరాష్ట్రపతి, సీఎం రేవంత్‌రెడ్డి ● ఖరారైన షెడ్యూల్‌.. ఏర్పాట్లలో అధికారుల నిమగ్నం

మెదక్‌జోన్‌: మెతుకుసీమకు ప్రముఖులు క్యూ కడుతున్నారు. ఆదివారం గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్‌ సీఎస్‌ఐ చర్చిని సందర్శించనున్నారు. చర్చి నిర్మించి వందేళ్లు పూర్తికావడంతో చరిత్ర తెలుసుకొని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం కొల్చారం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేయనున్నారు. అలాగే ఈనెల 25వ తేదీ క్రిస్‌మస్‌ పర్వదినం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మెదక్‌ చర్చిని సందర్శించి వందేళ్ల ఉత్సవాల్లో పాల్గొననున్నారు. అనంతరం ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకోనున్నారు. అదేరోజు ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ కౌడిపల్లి మండల పరిధిలోని తునిఖిలో గల కృషి విజ్ఙాన కేంద్రాన్ని సందర్శిస్తారు. వ్యవసాయ శాస్త్రవేత్తలతో మా ట్లాడి సేంద్రియ వ్యవసాయం గురించి తెలుసుకుంటారు. ఈ ప్రాంతంలో ఎంతమంది రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు..? దిగుబడి తదితర వివరాలను తెలుసుకోనున్నారు. ఇప్పటికే ప్రముఖుల షెడ్యూల్‌ ఖరారు కావడంతో ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం అయ్యారు. ఎలాంటి లోటుపాట్లు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.

సమన్వయంతో పనిచేయండి: సీఎస్‌

ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ మెదక్‌ జిల్లా పర్యటన నేపథ్యంలో కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డితో సీఎస్‌ శాంతికుమారి శనివారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సమన్వయంతో పని చేసి పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈ నెల 25 మధ్యాహ్నం 2.15 గంటల నుంచి 4.15 గంటల వరకు జిల్లాలో ఉపరాష్ట్రపతి పర్యటన ఉంటుందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ నగేష్‌తో పాటు జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

ఏడుపాయలలో ఎస్పీ పర్యటన

మెదక్‌ మున్సిపాలిటీ: జిల్లాలో గవర్నర్‌, సీఎం పర్యటన నేపథ్యంలో ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, అదనపు కలెక్టర్‌ నగేష్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. శ నివారం మెదక్‌లోని సీఎస్‌ఐ చర్చి, ఏడుపాయల్లో పర్యటించి అధికారులతో చర్చించారు. షెడ్యూల్‌ ప్రకారం పర్యటన సాగేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్‌, మెదక్‌ రూరల్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి, పలు పోలీస్‌స్టేషన్ల ఎస్‌ఐలు ఇతరశాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

న్యూస్‌రీల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
మెతుకుసీమకు ప్రముఖుల రాక 1
1/1

మెతుకుసీమకు ప్రముఖుల రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement