‘ఇందిరమ్మ’ సర్వేను త్వరగా పూర్తి చేయాలి
రామాయంపేట(మెదక్): ఇందిరమ్మ ఇళ్ల సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య సిబ్బందిని ఆదేశించారు. శనివారం మండలంలోని అక్కన్నపేటలో సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈసందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామంలో 840 దరఖాస్తులు వచ్చాయని, వాటిని జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. లబ్ధిదారుల వివరాలను పూర్తి సమాచారంతో ఆన్‌లైన్‌లో పకడ్బందీగా నమోదు చేయాలని ఆదేశించారు. ఆయనతో పాటు ఎంపీడీఓ సజీలుద్దీన్, పంచాయతీ కార్యదర్శి తదితరులు ఉన్నారు.
ఏడుపాయల హుండీ ఆదాయం రూ. 41.96 లక్షలు
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల హుండీ ఆదాయం రూ. 41,96,612 వచ్చినట్లు దేవా దాయ ధర్మాదాయ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్‌రెడ్డి, ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం గోకుల్‌షెడ్‌లో 59 రోజుల అనంతరం దుర్గమ్మ ఆలయ హుండీ అదాయం లెక్కించారు. రాజరాజేశ్వరి సమితి సభ్యులు లెక్కించగా, నగదుతో పాటు మిశ్రమ బంగారు, వెండి కానుకలు వచ్చాయి. కార్యక్రమంలో సూర్య శ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్‌శర్మ తదిత రులు పాల్గొన్నారు.
కక్షసాధింపుతోనే
కేటీఆర్‌పై కేసు
మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి
మెదక్‌జోన్: కేటీఆర్‌పై పెట్టిన అక్రమ కేసు ముమ్మాటికి కక్షసాధింపేనని మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని సూచించా రు. తుగ్లక్‌లా పాలించడం శోచనీయం అన్నా రు. గడిచిన పదేళ్లలో 24 గంటల కరెంట్ ఇచ్చి న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఇప్పటి కై నా కేటీఆర్‌పై పెట్టిన అక్రమ కేసును వెంటనే విత్ డ్రా చేసుకొని, అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదా ఈ విషయాన్ని అసెంబ్లీలో చర్చించాలని అన్నారు.
‘భూ భారతి’తో
రైతులకు మేలు
రామాయంపేట(మెదక్): కాంగ్రెస్ హయాంలో అన్నివర్గాలకు సమన్యాయం దక్కుతుందని పీసీసీ అధికార ప్రతినిధి రామచందర్‌గౌడ్ అ న్నారు. శనివారం రామాయంపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో తప్పు చేసిన బాధ్యులకు శిక్ష పడాల్సిందేనన్నా రు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రభుత్వ, దేవాల య భూములు కబ్జాకు గురయ్యాయని తెలి పారు. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని వి లువైన భూములను ఆక్రమించారని ఆరోపించారు. రైతులు భూ సంబంధిత సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం భూ భారతి ప్రవేశపెట్టిందన్నారు. ఈ పోర్టల్ ద్వారా రైతులకు మేలు కలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు స్వామి, నెహ్రూ నాయక్ పాల్గొన్నారు.
అమిత్‌షా దిష్టిబొమ్మ దహనం
మెదక్‌కలెక్టరేట్: అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్య లు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వెంటనే బర్తరఫ్ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మల్లేశం డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో అమిత్‌షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ రూపకల్పనతో పాటు దళిత, బహుజనవర్గాల కోసం అంబేడ్కర్ చేసిన కృషి, మరువలేనిదన్నారు. ప్రధాని మోడీ వెంటనే స్పందించి అమిత్‌షాను మంత్రివర్గం నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు మహేందర్‌రెడ్డి, బాలమణి, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment