లోక కల్యాణమే అందరి అభిమతం
సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: కులమతాలు ఏవైనా లోకకల్యాణ మే ప్రతీ ఒక్కరి అభిమతం కావాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. నారాయణఖేడ్‌లోని సాయిబాబా ఫంక్షన్‌హాల్‌లో ప్రభుత్వపరంగా సెమీ క్రిస్మ స్ వేడుకలు నిర్వహించారు. క్రైస్తవ పెద్దలతో కలసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కులమతాలకు ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఏసుక్రీస్తు లోకకల్యా ణం కోసం పాటుపడ్డారన్నారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో అశోకచక్రవర్తి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, వివిధ గ్రామాల పాస్టర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment